ఉమ్మెడ వంతెన వద్ద పోలీస్ బందోబస్తు పరిశీలన

గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని నిజామాబాద్ పోలీసు కమిషనర్ పి. సాయి చైతన్య సూచించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మెడ వంతెన వద్ద ఆదివారం తెల్లవారుజామున ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తు, భద్రతా ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. నిమజ్జనానికి తరలివచ్చే గణేశ్ విగ్రహాలు, భక్తులు, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చేపట్టిన రహదారి నియంత్రణ చర్యలను పరిశీలించారు. విధుల్లో ఉన్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని,





