రెవెన్యూ ఆఫీస్లో కూలిన సీలింగ్.. తృటిలో తప్పిన ప్రమాదం!
TG: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం రెవెన్యూ ఆఫీస్లో బుధవారం సీలింగ్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఆఫీస్ ఓపెన్ చేయడానికి కొద్దిసేపటి ముందే ఘటన జరగడంతో అధికారులు, సిబ్బందికి ప్రమాదం తప్పింది. వర్షాలకు స్లాబ్ తడిసి సిమెంట్ పెచ్చులు ఊడటంతో సీలింగ్ కూలినట్లు తెలుస్తోంది. భవనం కట్టి పదేళ్లు కూడా కాకుండానే ఇలా జరగడంపై నిర్మాణ నాణ్యతపై ప్రశ్నలు వస్తున్నాయి. వెంటనే రిపేర్లు చేయాలని సిబ్బంది కోరుతున్నారు.



