← Back to news

గుత్తిలో 1వ అదనపు మెజిస్ట్రేట్ కోర్టు ప్రారంభం

By DK· 1d ago
గుత్తిలో 1వ అదనపు మెజిస్ట్రేట్ కోర్టు ప్రారంభం

అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని కోర్టు ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన 1వ అదనపు మెజిస్ట్రేట్ కోర్టును హైకోర్టు న్యాయమూర్తి భానుమతి ప్రారంభించారు. నూతన కోర్టు భవనాన్ని ప్రారంభించి మౌలిక వసతులను పరిశీలించారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు సురేష్ రెడ్డి, చల్లా గుణరంజన్, జిల్లా న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కొత్త కోర్టు అందుబాటులోకి రావడంతో స్థానిక ప్రజలకు సత్వర న్యాయం అందే అవకాశం ఏర్పడిందన్నారు.

More in Local