← Back to news

స్వచ్ఛత ప్రతి పౌరుడి బాధ్యత: కలెక్టర్ రాజకుమారి

By సందీప్· 2h ago· Nandyala, Nandyal Urban, Nandyal
స్వచ్ఛత ప్రతి పౌరుడి బాధ్యత: కలెక్టర్ రాజకుమారి

నంద్యాల తహశీల్దార్ కార్యాలయానికి వచ్చే ప్రజల సౌకర్యార్థం కొత్తగా ఏర్పాటు చేసిన వాష్‌రూమ్స్‌ను కలెక్టర్ G. రాజకుమారి గాంధీ జయంతి సందర్భంగా ప్రారంభించారు. ప్రతిరోజూ వేలాది మంది వచ్చే కార్యాలయంలో తాగునీరు, మరుగుదొడ్ల కొరతను గుర్తించి ఈ వసతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్వచ్ఛత కేవలం ప్రభుత్వ బాధ్యత కాదని, ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని కలెక్టర్ చెప్పారు. మరుగుదొడ్లను ‘పే అండ్ యూజ్’ విధానంలో కేర్ టేకర్ల పర్యవేక్షణలో నిర్వహించనున్నట్లు తెలిపారు.

స్వచ్ఛత ప్రతి పౌరుడి బాధ్యత: కలెక్టర్ రాజకుమారి
స్వచ్ఛత ప్రతి పౌరుడి బాధ్యత: కలెక్టర్ రాజకుమారి

More in Local