సుండిపెంటలో తొలిసారి మట్టి గణపతి..! 🌱
నంద్యాల జిల్లా సుండిపెంట గ్రామంలో ఎకో-ఫ్రెండ్లీ ట్రెండ్ మొదలైంది. 'ఓం గణేష్ కమిటీ' ఆధ్వర్యంలో గ్రామంలో తొలిసారిగా మట్టి గణపతిని ప్రతిష్టిస్తున్నారు. కమిటీ కార్యనిర్వాహకులు కె. శివ, ఎన్. నాగరాజు ఈ విషయం తెలిపారు. POP విగ్రహాల వల్ల పర్యావరణానికి, జల వనరులకు ముప్పు ఉందని వారు చెప్పారు. అందుకే ఈ ఏడాది మట్టి విగ్రహమే బెస్ట్ అని డిసైడ్ అయ్యారు. ప్రకృతిని కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సూచించారు. మీ గ్రామంలో కూడా మట్టి గణపతిని పెట్టినట్లయితే ఈ కింద ఉన్న + గుర్తును ప్రెస్ చేసి ఫొటో, వార్తా పంపండి.