మతాలకు అతీతంగా.... లడ్డూ వేలం
TG: మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో మతసామరస్యం వెల్లివిరిసింది. టీచర్స్ కాలనీలో నిర్వహించిన గణపతి లడ్డూ వేలంలో ముస్లిం దంపతులు పాల్గొన్నారు. 85,316 రూపాయలకు హుస్సేన్ లడ్డూను దక్కించుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్య బేగం త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ లడ్డూను సొంతం చేసుకున్నట్లు హుస్సేన్ తెలిపారు.


