కరెంట్ షాక్‌తో తొమ్మిది నెలల బాబు మృతి

TG : ఖమ్మం జిల్లా చిన్నమునగాల గ్రామంలో నిన్న సాయంత్రం విషాదం జరిగింది. ఇల్లెందుల రమేష్ - మమత దంపతుల తొమ్మిది నెలల కొడుకు ఇంటి బయట ఆడుకుంటూ వెళ్లాడు. వర్షం కారణంగా ఎర్తింగ్ పైపు స్టీల్ మూతకు కరెంట్ షాక్ వస్తుండటంతో, దాన్ని పట్టుకున్న పసివాడు అక్కడికక్కడే పడిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లిన అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. వర్షాకాలంలో ప్రతీ ఒక్కరూ తమ ఇళ్లలో ఎర్తింగ్, వైరింగ్ జాగ్రత్తగా చూసుకోవాలని ఈ సంఘటన హెచ్చరిస్తోంది.

