← Back to news

దుద్దెడ చేనేత సంఘం మహాసభ

By Bejjanki· 1d ago· Siddipet
దుద్దెడ చేనేత సంఘం మహాసభ

సిద్దిపేట జిల్లా దుద్దెడ చేనేత సహకార సంఘం 76వ సర్వసభ్య సమావేశం ఇవాళ జరిగింది. నూతన పాలకమండలి వచ్చి నెలలవుతున్నా, పాత వర్గం నుంచి రికార్డులు, చార్జ్ అందకపోవడంతో పనులు ఆగిపోతున్నాయని ప్రెసిడెంట్ వడ్లకొండ శ్రీనివాస్ తెలిపారు. దీనివల్ల నూలు సరఫరా, పథకాల అమలు ఇబ్బందిగా మారిందన్నారు. పాత పాలకవర్గం అవినీతిపై లీగల్‌గా పోరాడతామని, అధికారులు వెంటనే చార్జ్ అప్పగించేలా చూడాలని కోరారు.

More in Local