← Back to news

పాముకాటుతో ఆరు నెలల బాలుడు మృతి!

By Bala· 1d ago

ములుగు జిల్లా తాడ్వాయి మండలం వెంగలాపూర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఈక తిరుపతి, స్వప్న దంపతుల ఆరు నెలల కుమారుడు పాముకాటుతో మృతి చెందాడు. మంచంలో నిద్రిస్తున్న బాబును పాము కాటువేసి వెళ్లిపోతుండగా తల్లి గుర్తించినట్లు సమాచారం. వెంటనే 108 అంబులెన్స్ కోసం ప్రయత్నించినా అందుబాటులో లేకపోవడంతో దంపతులు బాబును తీసుకుని బయలుదేరారు. మార్గమధ్యంలోనే పరిస్థితి విషమించి బాబు మృతి చెందాడు.

More in Local