'నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి'

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణను మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు పలు అంశాలపై చర్చించారు. తన రాజకీయ అనుభవాలను ఎమ్మెల్యేతో పంచుకున్న నరసయ్య.. ఇటీవల టోర్నడో ప్రభావంతో దెబ్బతిన్న పామాయిల్, మామిడి రైతుల పరిస్థితిని వివరించారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు.



