← Back to news

నందిపేటలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి

By naveed· 1d ago· నిజామాబాద్
నందిపేటలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి

నందిపేటలో స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. సంఘం నాయకులు బాపూజీ ఫోటోకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన మంత్రి పదవిని త్యాగం చేసిన గొప్ప నాయకుడని, బలహీన వర్గాల కోసం ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయని కొనియాడారు. నేటి తరం ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

More in Local