చెరువులకు దేవాదుల నీరు విడుదల.. రైతులకు ఊరట!

వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలంలో రైతులకు గుడ్ న్యూస్. దేవాదుల ప్యాకేజీ-5 ఎడమ కాలువ నుంచి మేడపల్లి, దబ్బిడిపేట చెరువులకు నీటిని విడుదల చేశారు. రైతుల సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చొరవతో నీటిని విడుదల చేశారు. చెరువులకు నీరు చేరడంతో ఆ ప్రాంత రైతులకు సాగునీటి ప్రయోజనం కలుగుతుంది. నీటి విడుదలపై రైతులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ బానోత్ మోహన్, గొర్రె రమేష్ పాల్గొన్నారు. ఇది రైతులకు పెద్ద రిలీఫ్..