పొదలకూరులో పోషణ మాసం కార్యక్రమం

నెల్లూరు జిల్లా పొదలకూరు ఎంపీడీవో కార్యాలయంలో 9వ జాతీయ పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా థీమ్–2 ఏఎంసీ సమావేశం నిర్వహించారు. వెంకటాచలం ICDS సీడీపీవో వి. విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తల్లులు, పిల్లల ఆరోగ్యానికి పోషకాహారం, సమతుల ఆహారం, పరిశుభ్రత ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఆహారం తీసుకునే సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలను ప్రదర్శన ద్వారా వివరించారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అవసరమైన పోషక పదార్థాలు, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై సూచనలు చేశారు.


