పోలీస్ ఆఫీసులో ఆయుధ పూజ

సూర్యాపేట జిల్లా పోలీస్ ఆఫీసులో దసరా సందర్భంగా ఆయుధ పూజ నిర్వహించారు. జిల్లా ఎస్పీ కె. నరసింహ ఈ కార్యక్రమంలో పాల్గొని పోలీస్ సిబ్బందికి దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడు పోయి మంచి గెలవాలని, సమాజంలో శాంతి, సంతోషాలు ఉండాలని అన్నారు. పోలీసుల విధుల్లో ఆయుధాలు, వాహనాలు కీలకమని తెలిపారు. వీటిని ఎప్పటికప్పుడు మెయింటైన్ చేస్తూ, విధుల్లో జాగ్రత్తగా ఉపయోగించాలని సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంతో పాటు శాంతిభద్రతలను కాపాడటంలో ఇవి ముఖ్యమని చెప్పారు.





