← Back to news

44వ స్టేట్ ENT డాక్టర్ల సదస్సు ప్రారంభం

By BK· 2d ago· AP
44వ స్టేట్ ENT డాక్టర్ల సదస్సు ప్రారంభం

AP : డాక్టర్లకు నైపుణ్య శిక్షణ చాలా అవసరమని కర్నూలు మెడికల్ కాలేజ్ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ పి.హరిచరణ్ అన్నారు. కాలేజీలో 44వ రాష్ట్ర ENT డాక్టర్ల సదస్సు మొదలైంది. మొదటిరోజు గొర్రె తలలు, ఊపిరితిత్తులపై ఎండోస్కోపిక్, సైలెండోస్కోపి వంటి అడ్వాన్స్‌డ్ ఆపరేషన్ పద్ధతులపై వర్క్‌షాప్ నిర్వహించారు. శని, ఆదివారాల్లో కే.ఫార్చ్యూన్ హోటల్‌లో సభలు జరగనున్నాయి. 25 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ కాన్ఫరెన్స్‌కు 514 మంది ENT డాక్టర్లు హాజరయ్యారు.

More in Local