నెల్లుట్ల చెరువులో గణేష్ నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు

TG: జనగామ జిల్లా నెల్లుట్ల చెరువులో గణేష్ విగ్రహాల నిమజ్జనానికి అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. మున్సిపల్ కమిషనర్ రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్, డీసీపీ, ఆర్డీవో సూచనలతో వివిధ శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేపట్టారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా భారీ క్రేన్లు, బోట్లు, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేక అప్రోచ్ రోడ్లు, తాగునీరు, పారిశుద్ధ్య చర్యలు పూర్తి చేశారు. పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్, టీజీఎన్‌పీడీసీఎల్ శాఖల అధికారులు చెరువు వద్ద ఏర్పాట్లను పరిశీలించారు.