మిషన్ భగీరథ నీళ్లలో మట్టి, పురుగులు

TG : మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం నాగులపల్లిలో మిషన్ భగీరథ తాగునీరు కలుషితంగా వస్తోందని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. నాగులపల్లి-మూసాపేట మధ్య పైప్‌లైన్ పగలడంతో నీటిలో మట్టి, పురుగులు వస్తున్నాయని తెలిపారు. నెల రోజులుగా అధికారులకు చెబుతున్నా స్పందించడం లేదని మండిపడుతున్నారు. వర్షాల వల్ల రోగాలు వస్తాయని భయపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పైప్‌లైన్ రిపేర్ చేసి, మంచి నీళ్లు ఇవ్వాలని కోరుతున్నారు.


