హెల్త్ అలర్ట్: ఈ చిన్న సింప్టమ్స్ ని లైట్ తీసుకోకండి!

మాట్లాడటంలో ఇబ్బంది, చేతులు, కాళ్లు సడన్‌గా పడిపోవడం, చూపు మసకబారడం వంటివి జరిగి కొన్ని నిమిషాల్లో తగ్గిపోతే దాన్ని ‘మినీ స్ట్రోక్’ అంటారు. ఇది ఫ్యూచర్‌లో వచ్చే పెద్ద స్ట్రోక్‌కి అడ్వాన్స్ వార్నింగ్. బ్రెయిన్‌కి కొద్దిసేపు బ్లడ్ సర్క్యులేషన్ ఆగడం వల్ల ఇది వస్తుంది. బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, స్మోకింగ్ అలవాటు ఉన్నవారికి మరియు 55 ఏళ్లు దాటిన వారికి ఈ రిస్క్ ఎక్కువ. ఇలాంటి సింప్టమ్స్ కనిపిస్తే టైమ్ వేస్ట్ చేయకుండా వెంటనే హాస్పిటల్‌కి వెళ్లాలి. డైలీ ఎక్సర్‌సైజ్, హెల్తీ ఫుడ్, రెగ్యులర్ చెకప్స్ ద్వారా దీన్ని నివారించవచ్చు.



