← Back to news

గణపతి బప్పా మోరియా.. రుద్రూర్లో సందడి!

By Abhishek· 6h ago· Rudrur, Rudrur, Nizamabad
గణపతి బప్పా మోరియా.. రుద్రూర్లో సందడి!

నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. గణనాథుడి నిమజ్జనం భక్తిశ్రద్ధలతో జరిగింది. అలంకరించిన వాహనంపై గణపతిని ఊరేగింపుగా తరలించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. డప్పులు, భజనలు, నృత్యాలతో ఊరేగింపు సందడిగా సాగింది. యువత, మహిళలు, చిన్నారులు "గణపతి బప్పా మోరియా" నినాదాలు చేశారు. అనంతరం భక్తుల సమక్షంలో నిమజ్జనం చేశారు. కార్యక్రమం ప్రశాంతంగా జరిగేలా నిర్వాహకులు, పోలీసులు ఏర్పాట్లు చేశారు.

More in Local