← Back to news

వైభవ్ పైన ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు

By charvaka· 10 Jul 2026
వైభవ్ పైన ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు

వరుస ఫెయిల్యూర్స్ తో ఒత్తిడిలో ఉన్న వైభవ్ సూర్యవంశీకి ధోనీ తాజా కామెంట్స్ గొప్ప భరోసా ఇస్తాయ్. స్పోర్ట్స్ జర్నలిస్ట్ విమల్ కుమార్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వైభవ్, నేను ఒకసారి అనుకోకుండా ఒకరినొకరు దాటుకుంటూ వెళ్లాం. మాట్లాడుకునే అవకాశం కూడా రాలేదు. వైభవ్ సూర్యవంశీకి చాలా అద్భుతమైన భవిష్యత్తు ఉంది. ప్రపంచమంతా అతని ఆటను గమనిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో రాణించగల అద్భుతమైన నైపుణ్యం ఆ కుర్రాడిలో ఉంది అని ధోనీ పొగిడారు.

More in Sports