4 కిలోమీటర్ల గుంతల రోడ్డు

పెద్దవడ్లపూడి నుంచి మంగళగిరి వెళ్లే బైపాస్ రోడ్డు గుంతలమయంగా మారి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 4 కిలోమీటర్లు మొత్తం గుంతలతోనే ఉండటంతో ప్రయాణం చాలా కష్టంగా మారింది. ఈ రోడ్డుపై రోజూ ప్రమాదాలు జరుగుతున్నాయని, వాహనాలు పాడవుతున్నాయని ప్రజలు మండిపడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఈ రోడ్డుకు రిపేర్లు చేయాలని కోరుతున్నారు.





