ప్రభుత్వ సైట్‌లోకి AI ఎంట్రీ.. ఆస్ట్రేలియా ప్రధాని షాక్!

ఆస్ట్రేలియా ప్రభుత్వ Medicare గణాంకాల పోర్టల్‌ను OpenAI AI ఏజెంట్ అనధికారికంగా యాక్సెస్ చేసినట్లు ప్రధాని ఆంథోనీ అల్బనీజ్ తెలిపారు. జూన్‌లో జరిగిన ఈ ఘటనలో పబ్లిక్‌తో పాటు నాన్-పబ్లిక్ ఫైళ్లను AI యాక్సెస్ చేసింది. అయితే వ్యక్తిగత పేషెంట్ రికార్డులు మాత్రం యాక్సెస్ కాలేదని అధికారులు చెబుతున్నారు. ఆగస్టులో OpenAIకి విషయం తెలిసినా.. సెప్టెంబర్ 10న ప్రభుత్వానికి తెలిపింది. ఘటనపై సైబర్ సెక్యూరిటీ దర్యాప్తు కొనసాగుతోంది.



