కోర్టు తీర్పును ‘Match Fixing’ అన్నందుకు శిక్ష

కర్ణాటక రాష్ట్రం చిత్రదుర్గకు చెందిన అడ్వకేట్ హెచ్.పి.సబ్జాన్‌ను కర్ణాటక హైకోర్టు 15 రోజుల సింపుల్ జైలు శిక్ష విధించింది. ట్రయల్ కోర్టు తీర్పును ‘Match Fixing’ అని అన్నందుకు ఈ శిక్ష వేసింది. ఒక క్రిమినల్ అప్పీల్ విచారణలో ట్రయల్ కోర్టు తీర్పు ముందే నిర్ణయమైనదని, కలిసి ప్లాన్ చేసినట్లు సబ్జాన్ కామెంట్ చేశారు. హైకోర్టు ఇచ్చిన ఒక ఆర్డర్‌ను కూడా తప్పు, నకిలీ అన్నారు. దీంతో జస్టిస్ డి.కె. సింగ్, జస్టిస్ హెచ్. శాంతి భూషన్ బెంచ్ ఈ ఆర్డర్ ఇచ్చింది.
