కాజీపేటలో గుర్తు తెలియని వృద్ధుడు మృతి

వరంగల్ జిల్లా కాజీపేటలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. కాజీపేట ఇన్స్‌పెక్టర్ శ్యాంసుందర్ తెలిపిన వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 26న ఉదయం 6 గంటలకు మున్సిపాలిటీ వర్కర్ జంగం సుధాకర్ చెత్త సేకరణకు వెళ్లగా వైన్ & డైన్ బార్ రెస్టారెంట్ పక్కన బస్ స్టాండ్ వద్ద మృతదేహం కనిపించింది. మృతుడి వయసు 50-60 ఏళ్లు, ఎత్తు 5.5 అడుగులు. భిక్షాటన చేసే వ్యక్తిగా గుర్తించారు. అనారోగ్యంతో మృతి చెందినట్లు భావిస్తున్నారు.



