సాగర్ నగర్ బీచ్‌లో గణపతి నిమజ్జనం.. ప్రత్యేక ఏర్పాట్లు

విశాఖపట్నం జిల్లా సాగర్ నగర్ బీచ్, రుషికొండ తీరాల్లో వినాయక నిమజ్జనం జరుగుతోంది. జీవీఎంసీ, పోలీసు శాఖలు కలిసి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాయి. సోమవారం సాయంత్రం నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. భద్రత కోసం తీరం వద్ద తాళ్లు ఏర్పాటు చేశారు. ప్రత్యేక సిబ్బందిని మోహరించారు. ప్రమాదాలు నివారించేందుకు భక్తులను సముద్రంలోకి అనుమతించడం లేదు. సిబ్బందే విగ్రహాలను తీసుకెళ్లి నిమజ్జనం చేస్తున్నారు. పూజా సామగ్రి సముద్రంలో కలవకుండా జీవీఎంసీ డంపర్ బిన్లు ఏర్పాటు చేసింది.