ట్రంప్‌కు బాలయ్య వీడియోతో ఇరాన్ కౌంటర్.. పోస్ట్ వైరల్!
అమెరికా–ఇరాన్ మధ్య ఉద్రిక్తతల వేళ ఇరాన్ ఎంబసీ చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జింబాబ్వేలోని ఇరాన్ రాయబార కార్యాలయం ‘ఎక్స్’లో బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి యాక్షన్ సీన్‌ను షేర్ చేసింది. ఇరాన్ తనను తాను రక్షించుకోలేని దేశం కాదంటూ ట్రంప్ వ్యాఖ్యలకు సెటైరికల్‌గా కౌంటర్ ఇచ్చింది. ఈ పోస్ట్ నెట్టింట ఆసక్తి రేపుతోంది.



