దుర్గాపూజలో నాన్‌వెజ్.. బెంగాల్‌లో పొలిటికల్ హీట్!

పశ్చిమ బెంగాల్‌లో దుర్గాపూజ సమయంలో నాన్‌వెజ్ తినడం, అమ్మడంపై చర్చ మొదలైంది. హిందూ మతానికి సంబంధించిన సంస్థ విశ్వ హిందూ పరిషత్ -VHP.. దుర్గాపూజ పండళ్ల దగ్గర నాన్‌వెజ్ అమ్మొద్దని చెప్పింది. దీనిపై బెంగాల్ BJP అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య స్పందిస్తూ.. బెంగాలీలు తమకు నచ్చిన ఆహారం తింటారని అన్నారు. దీంతో ఈ విషయం రాజకీయంగానూ చర్చగా మారింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ సర్కార్ వస్తే, చేపలు తిననివ్వదు అని మమత ప్రచారం చేశారు. అందుకే BJP నాన్‌వెజ్ విషయంలో వెనక్కి తగ్గట్లేదు.

