← Back to news

స్టేడియం పనులు వేగవంతం చేయాలి

By DK· 1d ago
స్టేడియం పనులు వేగవంతం చేయాలి

గుంటూరులోని బీఆర్ స్టేడియం అభివృద్ధి పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా వేగం పెంచాలని గుంటూరు నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే మహ్మద్ నసీర్‌తో కలిసి స్టేడియంలోని పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వర్షాకాలంలో స్టేడియంలోకి నీరు చేరడం, వాకింగ్ ట్రాక్‌లపై నీరు నిలవడంతో వాకర్స్ ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు. సీసీ డ్రైన్లు, వాకింగ్ ట్రాక్‌లు, క్రీడలకు అవసరమైన మౌలిక వసతుల కోసం సమగ్ర DPRలు సిద్ధం చేసి పనులు చేపట్టాలన్నారు.

More in Local