విద్యుత్ షాక్.. రైలింగ్ కార్మికుడు మృతి!
ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి మండలం కొత్తకొత్తూరు గ్రామంలోని ఎస్ఎఫ్ఐ స్కూల్‌లో రైలింగ్ పనులు జరుగుతున్నాయి. రాజస్థాన్‌కు చెందిన సునీల్ అనే కార్మికుడు స్టీల్ రైలింగ్ చేస్తుండగా, రైలింగ్ పైపు కరెంట్ తీగలకు తగిలింది. విద్యుత్ షాక్‌కు గురై సునీల్ స్పృహ కోల్పోయాడు. పాఠశాల యాజమాన్యం, తోటి కార్మికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


