← Back to news

చేగువేరా వర్ధంతి.. కార్మికులకు దుప్పట్లు

By GOLLAPALLI SUDHAKAR RAO· 2h ago· Thurpu Boyamadugula, Varikuntapadu, Sri Potti Sriramulu Nellore
చేగువేరా వర్ధంతి.. కార్మికులకు దుప్పట్లు

నెల్లూరుజిల్లా గూడూరు మాళవ్య నగర్‌లోని చేగువేరా ఫౌండేషన్ కార్యాలయంలో శుక్రవారం చేగువేరా 59వ వర్ధంతి, ఫౌండేషన్ 15వ వార్షికోత్సవం జరిగింది. వ్యవస్థాపకుడు మండ్ల సురేష్ బాబు, అధ్యక్షుడు గుండాల ఆదినారాయణ చేగువేరా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం 50 మంది భవన నిర్మాణ కార్మికులకు దుప్పట్లు పంపిణీ చేశారు. చేగువేరా ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకుని బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

చేగువేరా వర్ధంతి.. కార్మికులకు దుప్పట్లు

More in Local