← Back to news

జల్ జీవన్ పైపుల లీకేజీ.. నీరు వృథా!

By GOLLAPALLI SUDHAKAR RAO· 1h ago· Thurpu Boyamadugula, Varikuntapadu, Sri Potti Sriramulu Nellore
జల్ జీవన్ పైపుల లీకేజీ.. నీరు వృథా!

నెల్లూరు జిల్లా కొండాపురం మండల కేంద్రంలోని పశువైద్యశాల సమీపంలో జల్ జీవన్ మిషన్ పైపులైన్ల లీకేజీతో నాలుగు నెలలుగా నీరు వృథాగా పోతోంది. దీంతో రోడ్లు బురదమయంగా మారి, మురుగునీరు ఇళ్లలోకి వస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుంతల్లో పశువులు, కుక్కలు పడుతున్నాయని, కలుషిత నీటితో వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని, వెంటనే లీకేజీలను అరికట్టాలని కోరుతున్నారు.

More in Local