← Back to news

మంగళగిరి వైసీపీ సమన్వయకర్తగా వేణు

By epuri rajaratnam· 1d ago· Tadepalli, Tadepalli, Guntur
మంగళగిరి వైసీపీ సమన్వయకర్తగా వేణు

గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా తాడేపల్లికి చెందిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బుర్రముక్కు వేణుగోపాల సోమిరెడ్డిని నియమిస్తూ వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. పార్టీలో చురుకైన నాయకుడిగా గుర్తింపు పొందిన వేణుగోపాల సోమిరెడ్డికి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడంపై వైసీపీ శ్రేణులు, ఆయన అనుచరులు హర్షం వ్యక్తం చేశారు. మంగళగిరి నియోజకవర్గంలో పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

మంగళగిరి వైసీపీ సమన్వయకర్తగా వేణు

More in Local