← Back to news

హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ రద్దు చేయాలి.. కాంగ్రెస్ డిమాండ్!

By Appalanaidu· 1d ago· Munchingiputtu, Munchingi Puttu, Alluri Sitharama Raju
హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ రద్దు చేయాలి.. కాంగ్రెస్ డిమాండ్!

అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచింగిపుట్టులో INC ఆదివాసీ రాష్ట్ర వైస్ చైర్మన్ వెంగడ నీలకంఠం మాట్లాడారు. హౌస్‌హోల్డ్ మ్యాపింగ్‌ను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఫ్యామిలీ మ్యాపింగ్ పేరుతో కొనసాగించడం సరికాదన్నారు. గిరిజన ప్రాంతాల్లో ఒకే ఇంటి నంబర్‌లో వేర్వేరు పొయ్యిలతో జీవిస్తున్న కుటుంబాలను ఒకే కుటుంబంగా పరిగణిస్తే.. అర్హులైన వృద్ధులు, వితంతువులకు పెన్షన్లు ఎలా అందుతాయని ప్రశ్నించారు. క్షేత్రస్థాయిలో మ్యాపింగ్ లేదంటూ అధికారులు ప్రజలను తిప్పి పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

More in Local