← Back to news

రోడ్డుపై నిలిచిన నీటిలో చేపలు వదిలి నిరసన

By BK· 2h ago· కృష్ణా
రోడ్డుపై నిలిచిన నీటిలో చేపలు వదిలి నిరసన

కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం జానకిరామపురం గ్రామంలో డ్రైనేజీ నీరు రోడ్డుపై నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. డ్రైనేజీ నిర్మాణం అసంపూర్తిగా ఉండటంతో మురుగునీరు రోడ్డుపైనే ఉండిపోతోందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో మహిళా సంఘం ఆధ్వర్యంలో రోడ్డుపై నిలిచిన నీటిలో చేప పిల్లలను వదిలి వినూత్నంగా నిరసన తెలిపారు. MLA శ్రీ కృష్ణ ప్రసాద్ స్పందించి ఈ డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు.

More in Local