← Back to news

మంగళగిరిలో క్యాండిల్ లైట్ ప్రదర్శన

By KUCHIPUDI BUJJIBABU· 1d ago· Guntur
మంగళగిరిలో క్యాండిల్ లైట్ ప్రదర్శన

గుంటూరు జిల్లా మంగళగిరిలో ప్రజాస్వామ్య, రాజ్యాంగ హక్కుల పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ఈరోజు సాయంత్రం 5.30 గంటలకు క్యాండిల్ ప్రదర్శన నిర్వహించనున్నారు. లాడ్జి సెంటర్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రం, జనవిజ్ఞాన వేదిక, ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరమ్, మధ్యతరగతి ఫోరమ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. ప్రజాస్వామికవాదులు, విద్యార్థులు, యువత పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.

More in Local