ఉజ్జయినీలో మసీద్ టెన్షన్
మధ్యప్రదేశ్.. ఉజ్జయినిలో షాహి మసీద్ వివాదం నడుస్తోంది. సింహస్థ 2028 ప్రాజెక్టులో భాగంగా రోడ్డును 15 మీటర్ల వరకూ విస్తరిస్తున్నారు. ఇందుకోసం షాహి మసీదులో భాగమైన ప్రార్థనా హాల్, 120 అడుగుల మినార్‌ని కూల్చేయాలనే ప్లాన్ ఉంది. దీనికి హైకోర్టు అనుమతి ఉంది. ముస్లింలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించి, రాత్రంతా మసీదులో ఉండి నిరసనలు చేశారు. మండే మార్నింగ్ పెద్ద సంఖ్యలో జనం పోలీసులపై రాళ్లు విసిరి ఘర్షణకు దిగగా, పోలీసులు టియర్ గ్యాస్ వాడారు. హైకోర్టు తీర్పును మళ్లీ పరిశీలించాలనే డిమాండ్ ఉంది.



