← Back to news

పండుగ అందం.. జేబుకు భారం!

By Nani Eluri· 1d ago· Dishadaily
పండుగ అందం.. జేబుకు భారం!

TG: పండుగకు కొత్త లుక్‌లో రెడీ అవ్వాలని ప్లాన్ చేస్తున్న యూత్‌కు సెలూన్ బిల్లులు మామూలుగా లేవు. ఫేషియల్, హెయిర్ స్టైలింగ్, మేకోవర్ కోసం వెళ్తే జేబు ఖాళీ అవుతోంది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌లో కొన్ని మేకోవర్ ప్యాకేజీల ధరలు గతంలో 2,000 నుంచి 3,000 రూపాయలు ఉండగా.. ఇప్పుడు 4,500 నుంచి 6,000 రూపాయలకు పెరిగాయి. దీంతో సెలూన్‌లో వేల రూపాయలు ఖర్చు పెట్టడం కంటే ఇంట్లోనే రెడీ అవ్వడం బెటర్ అని కొందరు యూత్ అనుకుంటున్నారు.

More in TG