← Back to news

గుంటూరులో కార్మికుల మృతి.. నలుగురిపై కేసులు!

By Bala· 1d ago
గుంటూరులో కార్మికుల మృతి.. నలుగురిపై కేసులు!

గుంటూరులోని గ్రీన్ గ్రేస్ అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్‌ తాడు తెగి ఒడిశాకు చెందిన ఇద్దరు కార్మికులు మృతి చెందిన ఘటనలో YCP నేత అంబటి మురళితో పాటు మరో ముగ్గురిపై కేసులు నమోదయ్యాయి. పట్టాభిపురం పోలీస్ స్టేషన్‌తో పాటు కార్మిక శాఖలోనూ కేసులు నమోదు చేశారు. పనులు చేసే సమయంలో తమకు ఎలాంటి భద్రతా పరికరాలు అందించలేదని మృతుల్లో ఒకరి సోదరుడు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఘటనపై అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు.

More in Local