DTC కార్యాలయంలో మంత్రి ఆకస్మిక తనిఖీ

చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి DTC కార్యాలయాన్ని సందర్శించారు. పూతలపట్టు క్రాస్ వద్ద DTC నిరంజన్ రెడ్డి, RTO అధికారులు మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం కార్యాలయానికి చేరుకున్న మంత్రి అధికారులతో సమావేశమై పలు అంశాలపై సమీక్షించారు. ముఖ్యంగా కార్యాలయ నిర్వహణ, ప్రజలకు అందుతున్న సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సేవలు అందించడంలో ఎదురవుతున్న సమస్యలపై కూడా అధికారులతో చర్చించారు. DTC కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు.



