జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సర్వం సిద్ధం

అల్లూరి జిల్లాలో ZPTC,MPTC ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ టి. నిషాంతి తెలిపారు. ఈ నెల 21 నుంచి 23 వరకు నామినేషన్లు స్వీకరించనుండగా, 27న ఉపసంహరణకు గడువు ముగుస్తుంది. నవంబర్ 3న పోలింగ్, 5న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. జిల్లాలో 11 జెడ్పీటీసీ, 172 ఎంపీటీసీ స్థానాలకు 616 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు.



