కళాసి, హమాలీ కార్మికులకు Special Law కావాలి

విజయనగరం జిల్లా అసంఘటిత రంగంలో పనిచేసే కళాసి, హమాలీ కార్మికులకు పని భద్రతతో కూడిన సమగ్ర చట్టం చేయాలని రాజాం కళాసి కార్మిక సంఘం అధ్యక్షులు రామ్మూర్తినాయుడు డిమాండ్ చేశారు. రాజాం YSR పార్క్‌లో జరిగిన మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ.. కోట్లాది మంది కార్మికులు డైలీ వేజెస్‌పై ఆధారపడి బతుకుతున్నారని, ప్రమాదాలు జరిగినా పట్టించుకునే నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నమెంట్ కార్మికులకు అండగా నిలిచి ఆర్థిక సాయం అందించాలని కోరారు.
