నిమజ్జనం కోసం.. హైదరాబాద్ టు విజయవాడ

TG: వినాయకుడి నిమజ్జనం కోసం ఏటా ఒక పుణ్యక్షేత్రాన్ని ఎంచుకుంటున్న హైదరాబాద్ యువజన సంఘం ఈసారి విజయవాడకు వచ్చింది. హైదరాబాద్ నగరం వనస్థలిపురం సాహెబ్‌నగర్‌కు చెందిన క్రాంతి యువజన సంఘం సభ్యులు 30 మంది విజయవాడ వెళ్ళి అక్కడ ప్రకాశం బ్యారేజీ దిగువన కృష్ణానదిలో వినాయకుడిని నిమజ్జనం చేశారు. అనంతరం దుర్గమ్మను దర్శించుకున్నారు. ఇలా 15 ఏళ్లుగా విజయవాడ, భద్రాచలం, శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాల్లో నిమజ్జనం చేస్తున్నట్లు సభ్యులు తెలిపారు.


