అభివృద్ధి పనుల్లో నాణ్యత తప్పనిసరి: MLA

పల్నాడు జిల్లా వినుకొండ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని వినుకొండ MLA జీవీ ఆంజనేయులు తెలిపారు. పట్టణ అభివృద్ధిలో భాగంగా 65 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు, మూడు స్వాగత తోరణాల పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద 25 లక్షలతో నిర్మించనున్న సిమెంట్ రోడ్డు పనులకు భూమిపూజ చేశారు. అనంతరం లయోలా స్కూల్ వద్ద 40 లక్షలతో ఏర్పాటు చేయనున్న మూడు స్వాగత తోరణాల్లో మొదటి ఆర్చికి శంకుస్థాపన చేశారు.



