పర్యావరణ హితం కోసం మట్టి వినాయకుల పంపిణీ

TG: పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలను ప్రజలకు ఉచితంగా పంపిణీ చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో వినాయక చవితి సందర్భంగా AVOPA ఆధ్వర్యంలో 1,000 మట్టి వినాయక విగ్రహాలను వితరణ చేశారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వినియోగంతో నీటి వనరులు, పర్యావరణానికి కాలుష్య ముప్పు ఏర్పడుతుందని నిర్వాహకులు తెలిపారు. పర్యావరణహిత మట్టి విగ్రహాలను వినియోగించాలని ప్రజలకు సూచించారు. గత ఎనిమిదేళ్లుగా జమ్మికుంట AVOPA ఆధ్వర్యంలో ఏటా 1,000 మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.