ఇయర్ కఫ్స్ ట్రెండ్

పాతకాలం నాటి నగలు మళ్లీ ఫ్యాషన్లో ట్రెండ్ అవుతున్నాయి. పండగల సీజన్లో సంప్రదాయ బట్టలతో పాటు ఇయర్ కఫ్స్కు డిమాండ్ పెరుగుతోంది. చెవి మొత్తం కనిపించేలా ఉండే ఈ నగలు ప్రత్యేకమైన లుక్ను ఇస్తున్నాయి. వీటికి చెంపసరాలు జత చేస్తే మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఇమిటేషన్ జువెలరీలో బాలీవుడ్ స్టైల్ ఇయర్ కఫ్స్కు కూడా ఆదరణ పెరుగుతోంది.
