← Back to news

రైలు కిటికీకి వేలాడిన వ్యక్తి..వీడియో వైరల్

By Sharmila· 5h ago

బిహార్‌లో మొబైల్ దొంగతనానికి ప్రయత్నించిన ఓ వ్యక్తికి ప్రయాణికులు షాకిచ్చారు. రైల్లో ఫోన్ స్నాచింగ్‌కు ప్రయత్నించిన అతడిని ప్రయాణికులు రైలు కదలగానే కిటికీలోంచి అతడి చేతులు గట్టిగా పట్టుకున్నారు. దీంతో నిందితుడు కదులుతున్న రైలు బయట వేలాడుతూ కనిపించాడు. రైలు వేగంగా ముందుకు వెళ్తుండగా అతను కిందపడటంతో గాయాలయ్యాయి. అతడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వేలాడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటనపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.

More in Viral