యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి: ఎస్సై

డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యమని ఈగల్ ఎస్సై సునీల్ బాబు అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నగరపాలక సంస్థ పరిధిలోని యర్రబాలెంలో ఈగల్ ఆధ్వర్యంలో పల్లెబాట కార్యక్రమం నిర్వహించారు. గంజాయి, ఇతర డ్రగ్స్ రవాణా, విక్రయాలు, నిల్వలపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని ఎస్‌ఐ తెలిపారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండేలా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుమానాస్పద కదలికలు లేదా మాదకద్రవ్యాల సమాచారం ఉంటే ఈగల్ 1972 టోల్‌ఫ్రీ నంబర్‌కు తెలియజేయాలని కోరారు. ప్రజల సహకారంతోనే మాదకద్రవ్యాల నియంత్రణ సాధ్యమన్నారు.


