వర్షపు నీటితో భక్తులకు ఇబ్బందులు

వనపర్తి జిల్లా గోపాల్‌పేట మండల కేంద్రంలోని కోదండ రామస్వామి ఆలయం ముందు వర్షం పడిన ప్రతిసారీ నీరు నిలుస్తుండటంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఆలయానికి వచ్చే భక్తులు నీటిలో నుంచే వెళ్లాల్సి వస్తోందని గ్రామస్తులు చెబుతున్నారు. వర్షం తగ్గిన తర్వాత కూడా నీరు నిలిచిపోవడంతో సమస్య మరింత ఇబ్బందికరంగా మారుతోందని తెలిపారు. ఆలయం ముందు నీరు నిలవకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని భక్తులు, గ్రామస్తులు కోరుతున్నారు.



