అది దేశ ద్రోహమే: ప్రియాంక గాంధీ
ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని తెలిసినా ఎన్నికల సంఘం వాటిని అనుమతిస్తే అది ‘దేశద్రోహ చర్య’ అవుతుందని కాంగ్రెస్ MP ప్రియాంక గాంధీ అన్నారు. కేరళలోని నీలంబూర్‌లో ఆమె మాట్లాడుతూ.. ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపు, ఎన్నికల కమిషనర్ల అభ్యంతరాలపై <a href="https://www.theclearcutnews.com/n/z5XNzeN">నిష్పాక్షిక దర్యాప్తు </a>జరగాలని కోరారు. ఆరోపణలు అత్యంత తీవ్రమైనవన్న ఆమె.. అన్యాయమైన ఎన్నికలు ప్రజాస్వామ్యానికే ముప్పు కలిగించవచ్చని హెచ్చరించారు.


