పల్లె నిద్రతో గ్రామ సమస్యలపై దృష్టి : SP

AP: శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న “మెగా పల్లెనిద్ర” కార్యక్రమంలో భాగంగా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి కళింగపట్నం గ్రామాన్ని సందర్శించారు. సోమవారం రాత్రి గ్రామస్థులతో సమావేశమైన ఎస్పీ సీసీ కెమెరాల ఏర్పాటు, ట్రాఫిక్ సమస్యలు, మాదక ద్రవ్యాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణపై చర్చించారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకంగా పనిచేస్తాయని తెలిపారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.




